Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఆలయంలోనే హంసవాహనంపై రాములోరు అ నేడు ఉత్తరు ద్వార దర్శనం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
భద్రాచల పుణ్యక్షేత్రానికి అనుబంద ఆలయమైన పర్ణశాల రామాలయంలో ఈ నెల 3 వ తేదీనుండి జరుగుతున్న వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అద్యయనోత్సవములో భాగంగా 9 రోజుల పాటు వివిధ రూపాలలో దర్శనమిచ్చి శ్రీ సీతారామచంద్రస్వామి వారు 10వ రోజు బుధవారం తెప్పోత్సవం కార్యక్రమాన్ని సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ నేపద్యంలో గోదావరి నదిలో హంస వాహనం పై విహరించాల్సిన శ్రీ సీతారామచంద్రస్వామి వారు ఆలయంలో ఏర్పాటు చేసిన హంసవాహనంపై ఆశీనులై విశేష పూజలు అందుకున్నారు. తెప్పోత్సవం కార్యక్రమంలో భాగంగా ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు ఉదయం 10.30 నిమిషములకు తిరుమంగై అళ్వార్ పరమపదోత్సవం వంటి పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో పెట్టి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆలయంలో ఏర్పాటు చేసిన హంసవాహనంపై ఆశీనులు చేశారు. ఈ సందర్బంగా పురోహితులు భార్గవాచార్యులు, నృసింహాచార్యులు, శేషం కిరణ్ కుమారా చార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు, తహశీల్దార్ వర్షా రవికుమార్, పర్ణశాల సర్పంచ్ తెల్లం వరలకీë, ఆర్ఐలు లక్ష్మయ్య, ఆదినారాయణ, ఏఈఓ భవాని రామకృష్ణ, సూపరిండెంట్ బి.కిషోర్, ఆలయ ఇన్చార్జీ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ రెడ్డి, రాము, యగ్గడి శివలతో పాటు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.