Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వాపురం
మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు బుధవారం నిర్వహించారు. తొలుత ఎంహెచ్డీ నాయకులు గొల్లపల్లి నరేష్ స్వామి వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ సంస్కృతిని ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు అని కొనియాడారు. ఆయన రచించిన రచనలు సూక్తులు అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజలందరూ వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్డీ మండల మహిళా అధ్యక్షురాలు గద్దల ఆదిలక్ష్మి, మహిళా ప్రధాన కార్యదర్శి మురికిపూడి భూమిక, ప్రధాన కార్యదర్శి ఈనపెళ్లి పవన్ సాయి, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.