Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అడిషనల్ డీఎంహెచ్ఓ
డాక్టర్ దయానంద స్వామి
నవతెలంగాణ-భద్రాచలం
ఏజెన్సీ ఏరియాలో గిరిజనుల కోసం, వారి కుటుంబాల ఆరోగ్య పరిరక్షణ చూడవలసిన బాధ్యత ఏజెన్సీ ఏరియాలో పనిచేయుచున్న వైద్యాధికారులదేనని అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ దయానంద స్వామి సంబంధిత డాక్టర్లకు సూచించారు. బుధవారం భద్రాచలం ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏజెన్సీ ఏరియాలో పనిచేయుచున్న వైద్యాధి కారులు, ప్రోగ్రాం అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య వృత్తి అనేది చాలా పవిత్రమైనదని ఆయన అన్నారు. అందుకు మనమందరం గిరిజనుల సేవ కోసం మన ఆధీనంలో పనిచేయుచున్న సిబ్బంది అందర్నీ కలుపుకొని చాలా బాధ్యతగా పనిచేయాలని ఆయన అన్నారు. అలాగే ప్రతిరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గాని సబ్ సెంటర్ గాని 50 కంటే ఎక్కువగా పేషెంట్లు వచ్చే అవకాశం ఉన్నందున వారినందరిని చాలా జాగ్రత్తగా వైద్యం అందించాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్క ఒక అంశం కంప్యూటర్లో పొందుపరచాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీటీసీఓ జి.శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ వినోద్, వీరబాబు, ప్రోగ్రామ్ ఆఫీసర్ బావ సింగ్, మెడికల్ ఆఫీసర్లు ప్రోగ్రాం అధికారులు తదితరులు పాల్గొన్నారు.