Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఆదివాసీ గిరిజన సంఘం, సీఐటీయూ
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం ట్రాక్టర్ లోడింగ్-అన్ లోడింగ్ అండ్ డ్రైవర్ల కార్మిక సీఐటీయూ అనుబంధ సంఘం జనరల్ బాడీ సమావేశం యూనియన్ అధ్యక్షురాలు సరస్వతి అమ్మ అధ్యక్షతన బుధవారం సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి, పట్టణ కన్వీనర్ వై.వి.రామారావు, ఆదివాసీ గిరిజన సంఘం పట్టణ కార్యదర్శి కుంజా శ్రీనివాస్‌లు మాట్లాడారు. డిసెంబర్ నెలలో లోడింగ్ కార్మికులకు ట్రాక్టర్ యజమానులు ట్రిపు లోడింగ్‌కి రూ.400 ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వారి ఉపాధి కోల్పోయే విధంగా జేసీపీలతో లోడింగ్-అన్లోడింగ్ చేస్తూ పట్టణ ప్రజలకు అమ్ముతు న్నారని వారు ఆరోపించారు. కార్మికులకు మాత్రం మొండి చేయి చూపిస్తూ 20 సంవత్సరాల నుండి ఈ ట్రాక్టర్ వృత్తిని నమ్ముకున్న డ్రైవర్లు, గిరిజన మహిళల ఉపాధి కోల్పోయే విధంగా ఉన్నాయన్నారు. ఇటువంటి చర్యలను సహించేది లేదని వారన్నారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే ఐటీడీఏ పీఓ, కలెక్టర్లను కలవనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎంబి.నర్సారెడ్డి, గిరిజన సంఘం జిల్లా నాయకురాలు సున్నం గంగ, సీఐటీయూ నాయకులు ఎం.రేణుక, జి.స్వామి, ఎన్.నాగరాజు, లక్ష్మణ్, కుర్సం రవి, లక్ష్మి, ట్రాక్టర్ డ్రైవర్లు లోడింగ్-అన్ లోడింగ్ కార్మికులు పాల్గొన్నారు.