Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తాం : వ్యవసాయ
శాఖ అధికారి
నవతెలంగాణ-ఇల్లందు
అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ మండల అధికారి సతీష్, ఏవో సిబ్బంది బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కొమరారం పోలారం, మాణిక్యం, మర్రిగూడెం తదితర గ్రామాల్లో 350 ఎకరాల్లో మొక్కజొన్న, 110 ఎకరాలలో మిర్చి, 15 ఎకరాలలో పొగాకు పంటలకు తీవ్ర నష్టం ఏర్పడిందన్నారు. అంచనాలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. అర్ధరాత్రి ఈదురు గాలులు, వడగళ్ళు పడటంవల్ల పంటంతా వాలిపోయి పాడైందన్నారు. ఎకరానికి సుమారు రూ.20,000 నష్టం వాటిల్లినట్లు తెలిపారు. నివేదికను రూపొందించి ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు తెలిపారు.