Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోలార్ కార్మికుల వెంటనే జీతాలు చెల్లించాలని ఇఫ్ట్యూ రాష్ట్ర నాయకులు డి.ప్రసాద్ ఎస్కే.యాకుబ్ షావలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక కార్యాలయంలో బుధవారం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్ఎస్సిసిడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొని మాట్లాడుతూ కొత్తగూడెం సింగరేణి సోలార్ కార్మికుల జీతాలు 3 నెలలు పెండింగ్లో ఉన్నాయన్నారు. జీతాలు చెల్లించాలని మహాప్రభో అని సింగరేణి అధికారులకు సోలార్ కాంట్రాక్టర్లకు విన్నవించిన చెవిటి వాడిముందు శంఖం ఊదిన చందంగా వుందన్నారు. తప్పని పరిస్థితుల్లో జీతాలకోసం సమ్మె చేస్తున్నారన్నారన్నారు. వారి ఆఖరి పోరాటానికి మద్దతు ఇస్తున్నామని సింగరేణి వ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలియ జేశారు. వెంటనే సింగరేణి యాజమాన్యం జోక్యం చేసుకొని కార్మికుల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే సింగరేణి వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, రీజియన్ కార్యదర్శి మల్లెల వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు పాయం వెంకన్న, మున్సిపల్ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.