Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
ఐద్వా భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సుభాష్ నగర్ ఏడవ వార్డ్‌లో బి.కుసుమ ఆధ్వర్యంలో బుధవారం ఆటలు పోటీలు నిర్వహించారు. ఈ ఆటల పోటీల సందర్భంగా ఐద్వా పట్టణ కమిటీ కార్యదర్శి డి.సీతా లక్ష్మి మాట్లాడుతూ సంక్రాంతి అంటేనే తెలుగు వారికి పెద్ద పండుగ అని ఆమె అన్నారు. ఈ పండుగను నాల్గు రోజులు జరుపుకుంటామన్నారు. సంక్రాంతి విశిష్టితను వివరించారు. పెరిగిన నిత్యావసరాల వల్ల పండుగలు చేసుకొనే పరిస్థితి లేదని ఆమె అన్నారు. కరోనాను అరికట్టడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. బి.కుసుమ ఆధ్వర్యంలో నాల్గు సెంటర్లో నాలుగు ఆటలు నిర్వహించారు. గెలిచిన వారికి మొదటి, ద్వితీయ, తృతీయ అలాగే పాల్గొన్న చేసిన ప్రతి ఒక్కరికీ బహుమతులు అందజేశారు. ఐద్వా పట్టణ అధ్యక్షురాలు యు.జ్యోతి, ఐద్వా జిల్లా నాయకులు నాదెళ్ల లీలావతి, జోన్, ఐద్వా ఆఫీసు జీవన్ జ్యోతి, రాధ, ఏం.నూకరత్న, చిన్న నుకరతనం, ఏం.లింగమ్, కోమల, ప్రకుతమ్మ, నాగలక్ష్మి పాల్గొన్నారు.