Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో 10 డీసీఎమ్‌లు, 11 బులెరో వాహనాలలో అర్ధరాత్రి సమయంలో చర్ల మండల ప్రజలు నిద్రపోతున్న సమయంలో గోవులను ఎక్కిస్తున్నారని, అది తెలుసుకున్న భజరంగ్ దళ్ బీజేపీ నాయకులు, సభ్యులు అక్కడికెల్లి వాహనాల్లో ఉన్న గోవులను కిందకు దింపి కాళీ వాహనాలు వెనకకు తరలించారు. ఇది అంత ఒక ఎత్తు అయితే ప్రజా ప్రతినిధి అండతో కొంతమంది వాహనాలతో ఢకొీట్టి అయినా సరే మేము వ్యాపారం చేస్తామని భజరంగ్ దళ్ కార్యకర్తలపై భేదిరింపులు చేస్తున్నారని భజరంగ్ దళ్ కార్యకర్తలు తెలిపారు. గతంలో కత్తిగూడెం గ్రామంలో చర్ల నుండి సుబ్బంపేట వెళ్తున్న ఆటోను ఢ కొనడంతో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. అది అందరికీ తెలిసిన విషయమే. మృతి చెందిన వారి కుటుంబానికి రూ.లక్ష ఇచ్చి సెటిల్మెంట్ చేశారని పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది అంతా నిజంగానే జరిగివుంటే కొంతమంది వ్యాపారులు మేము ఏమీ చేసినా అడిగేవాళ్లు లేరని అక్రమంగా తరలిస్తున్న గోవులను ఆపడానికి వెళ్లిన భజరంగ్ దళ్ కార్యకర్తలను మీకు ఇదే గతి పడుతుందని భేదిరింపులు చేస్తున్నట్టు వారు ఆందోళన చెందుతున్నారు. ఇది కాగా భజరంగ్ దళ్ కార్యకర్తలు గోవులను ఆపి డబ్బుల కోసమే చేస్తున్నారని కార్యకార్యకర్తలను అధికార ప్రజాప్రతినిధి అనుచిత వ్యాఖ్యలు చేసేస్తున్నట్టు వారు తెలిపారు. మండల ప్రజా ప్రతినిధి భజరంగ్ దళ్ కార్యకర్తలను భేదిరించగా భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్యను కలిసి ప్రజాప్రతినిధి నుండి మాకు ఆత్మ రక్షణ కలిపించంని విశ్వహిందు పరిషత్ రాష్ట్ర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ వోరుగంటి సురేష్ కుమార్, విశ్వహిందూ పరిషత్ జిల్లా సహ కార్యదర్శి జెట్టి వెంకట్రాజు, చర్ల బజరంగ్దళ్ మండల సంయోజక్ ముత్యాల చరణ్ తేజ, చర్ల బజరంగ్దళ్ సురక్షా ప్రముఖ్ బొల్లె సందీప్, చర్ల భజరంగ్ దళ్ గోరక్ష ప్రముఖ్ చల్ల సందీప్, రెడ్డి రాంప్రసాద్‌లు లేఖను ఎమ్మెల్యే పొదెం వీరయ్య అదించారు.