Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వేధింపులకు గురిచేస్తున్న కాంట్రాక్టర్
నవతెలంగాణ-కొత్తగూడెం
బొగ్గు బావుల ప్రయివేటీకరణ నిలిపి వేయాలని డిమాండ్ చేస్తు డిసెంబర్లో జరిగిన సమ్మెలో పాల్గొన్న కాంట్రాక్టు కార్మికుల నుండి సమ్మెలో ఉన్న మూడు రోజులకు ఫెనాల్లీ కట్టాలని కాంట్రాక్టర్ వేదింపులు చేయడం సరికాదని, ఫెనాల్టీ చెల్లించేది లేదని కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం నాయకులు గూడెల్లి యాకయ్య స్పష్టం చేశారు. బుధవారం ఆ సంఘం ఆధ్వర్యంలో రుద్రంపూర్‌లోని సివిల్ ఆఫీస్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యాకయ్య మాట్లాడుతూ జాతీయ సంఘాల జేఏసీ పిలుపు మేరకు డిసెంబర్ 9,10,11వ తేదీన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరిగినటువంటి సమ్మెలో కాంట్రాక్ట్ కార్మికులు కూడా పాల్గొన్నారు. ఆ మూడు రోజులకు సంబంధించి కాంట్రాక్ట్ కార్మికులకు పెనాల్టీ వేయాలని యాజమాన్యం చెప్పినట్టు కాంట్రాక్టర్లు కార్మికులపై కాంట్రాక్టర్ వేదింపులకు పాల్పడుతున్నారన్నారు. జాతీయ సంఘాల పిలుపు మేరకు చేసినటువంటి సమ్మె కాబట్టి నోవర్క్... నోపే కింద దాన్ని పరిగణనలోకి తీసుకొని కాంట్రాక్ట్ కార్మికులకు పెనాల్టీ లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్, చిన్ని, విజరు సుబ్బారావు, రవి, యాదగిరి, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.