Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మృతులకు పార్టీ ద్వారా చేపట్టిన బీమా సొమ్ము రూ. 12లక్షల విలువగల చెక్కులను ఆయా కుటుంబాలకు ఎమ్మెల్యే సండ్ర అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. పార్టీని నమ్ముకుని పనిచేసే కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందనడానికి ఇది నిదర్శనమన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో ధీటుగా నిలుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ పార్టీగా కార్యకర్తలకు అండగా పిలిచేందుకు రూపొందించిన ఈ బీమా పథకం ప్రమాదంలో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు ఊరట కలిగిస్తోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, బొడ్డు శివ, కౌన్సిలర్లు ఎస్కే చాంద్‌పాషా, అద్దంకి అనిల్‌కుమార్ పాల్గొన్నారు.