Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడేండ్లుగా ఎదురుచూపు ...కొలిక్కిరాని ఎంపిక
నవతెలంగాణ-వేంసూరు
మండల కేంద్రంలో గత నాలుగు సంవత్సరాల క్రితం అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 60 డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఇళ్ల నిర్మాణం పూర్తయి మూడు సంవత్సరాలు అయినప్పటికీ వివిధ కారణాల రీత్యా వాయిదా పడుతూ వచ్చిన ప్రారంభోత్సవం. లబ్ధిదారుల ఎంపిక కొలిక్కి రాకపోవడంతో ఇళ్ల కోసం ఎదురుచూసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. లబ్ధిదారుల ఎంపికలో అధికారులకు తలనొప్పిగా మారింది. తాజాగా మంగళవారం పంచాయతీ కార్యాలయంలో జరిగిన లబ్ధిదారుల ఎంపిక గ్రామసభ. రసవత్తరంగా సాగింది. లబ్ధిదారులు ఒకరిపై ఒకరు విమర్శలు. అనర్హులను అర్హుల జాబితాలో చేర్చి అర్హత ఉన్న లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందని వాదనకు దిగారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక మండల ప్రత్యేక అధికారి గోవిందరెడ్డి, తాసిల్దార్ ముజాహిద్ వాస్తవ పరిస్థితులను కలెక్టర్కు నివేదించి మరోసారి గ్రామ సభ ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామ సభలో సర్పంచ్ ఫైజుదిన్, ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ నాయుడు వెంకటేశ్వరరావు, సొసైటీ అధ్యక్షుడు తక్కెళ్ళపాటీ గోపాలకృష్ణ, ఆర్ఐ హరి ప్రసాద్, ఎస్ఐ విజరుకుమార్ పాల్గొన్నారు.