Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
నగరంలోని ఎన్టీఆర్ భవన్లో ఎన్టీఆర్ 26 వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించి, తలసేమియా పిల్లలకు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నిరుపేదలకు, వృద్ధులకు దుప్పట్లు వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఎన్టీఆర్ కూడలిలోని విగ్రహానికి పూలమాల వేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమావేశంలో పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శులు కేతినేని హరీష్, గుత్తా సీతయ్య, రాష్ట్ర కార్యదర్శి చేతుల నాగేశ్వరరావు, యువత పార్లమెంట్ అధ్యక్షుడు నల్లమల రంజిత్, యువత రాష్ట్ర నాయకులు నున్నా నవీన్, కాంపాటి విజరు, టిఎన్ఎస్వి పార్లమెంట్ అధ్యక్షులు ఆకారపు శ్రీనివాస్, నగర పార్టీ నాయకులు వడ్డెమ్ విజరు, కందిబండ నరసింహారావు, ప్యారిస్ ఎంకన్న, బాత రాజు కనకయ్య, తాళ్లూరు శ్రీనివాస్, కన్నేటి పృద్వీ, కూచిపూడి జై, బోడేపూడి రవి, ఆరెకట్ల కొండలరావు, నూక హనుమంతరావు, చింతనిప్పు నాగేశ్వరరావు, నల్లమాస మల్లయ్య, ఒక్కంతుల రవి, జక్కంపూడి రామనుజమ్ తదితరులు పాల్గొన్నారు.