Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
మండలంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన చేశారు. మంగళవారం కార్యకర్తలతో కలిసి పదిహేను గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి 47 కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్‌లను ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ అందజేశారు. వీటితోపాటు పార్టీ ప్రమాద బీమా, సీఎం సహాయనిధి చెక్కులు సైతం అందజేశారు. ఎమ్మెల్యే రాములు నాయక్‌కు పదిహేను గ్రామాల్లో ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే పర్యటన విజయవంతానికి మండల పార్టీ జడ్పీటీసీ పోట్ల కవిత శ్రీను దంపతులు విశేష కృషి చేశారు. బైక్ పర్యటన విజయవంతం కావడంతో కార్యకర్తల్లో జోష్ నెలకొంది. కార్యక్రమంలో మండల తెరాస అధ్యక్షులు వై చిరంజీవి, జెడ్పిటిసి పోట్ల కవిత, జిల్లా తెరాస నాయకులు పోట్ల శ్రీనివాసరావు, రైతు సమన్వయ సమితి కన్వీనర్ కిలారు మాధవరావు, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు పోగుల శ్రీనివాసరావు, పిఎసిఎస్ చైర్మన్ చెరుకుపల్లి రవి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు చల్లా మోహన్ రావు, తెరాస మండల ఉపాధ్యక్షులు విజరు కుమార్, జిల్లా నాయకులు డేరంగుల బ్రహ్మం, సూడా డైరెక్టర్ బండారు కృష్ణ, పాసంగులపాటి శ్రీను, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొచ్చర్ల బిక్షం, యూత్ నాయకులు మద్దినేని నరేష్, పోట్ల నితీష్, ఉప్పలచెలక సర్పంచ్ మాన్సింగ్, నున్నా రామకృష్ణ, గుర్రం వెంకటేశ్వర్లు, లకావత్ ప్రకాష్, తేజావత్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.