Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర శ్రీనివాసరావు
నవతెలంగాణ-గాంధీచౌక్
ఈ నెల 23 నుండి 25 వరకు రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న పార్టీ మూడవ రాష్ట్ర మహాసభలకు హార్థిక, ఆర్థిక సహకారాలు అందించి జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. త్రీ టౌన్లో పియస్‌ఆర్ రోడ్డు, గాంధీ చౌక్‌లో మహాసభలు జయప్రదం కోరుతూ బుధవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. టౌన్ కమిటీ కార్యదర్శి భూక్య శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సీపీఐ(ఎం) ఈ మహాసభలలో భవిష్యత్ ప్రజా ఉద్యమాలకు రూపకల్పన చేయనున్నట్లు పేర్కొన్నారు. పాలకులు అనుసరిస్తున్న కార్పొరేటీకరణ విధానాల ఫలితంగా దేశంలో, రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక అసమానతలు పెరిగాయన్నారు. ఫలితంగా నిరుద్యోగం, అవినీతి, ఆకలి చావులు, దరిద్రం మెజారిటీ ప్రజలను వెంటాడుతోందన్నారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఐక్య ప్రజా ఉద్యమాలు తప్ప మరో మార్గం లేదని, ఈ ప్రజా ఉద్యమాల రూపకల్పన, మహాసభల నిర్వహణ కోసం, మహాసభలు జయప్రదం లో తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో త్రీ టౌన్ కార్యదర్శివర్గ సభ్యులు తుశాకుల లింగయ్య, ఎస్.కె ఇమామ్, పత్తి పాక నాగ సులోచన, నాయకులు గబ్బెటి పుల్లయ్య, సారంగి పాపారావు, మద్ది శ్రీను పాల్గొన్నారు.