Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రోజురోజుకు పెరుగుతున్న కేసులు
అ క్వారంటైన్ లేకుండా రోడ్లపైకి
అ నిబంధనలు పాటించని జననం
అ జరిమానాలు మరిచిన మున్సిపల్ పోలీసు శాఖలు
నవతెలంగాణ-ఇల్లందు
మూడవ వేవ్‌లో కరోనా విజృంభిస్తోంది. కేసుల పెరుగుదల వేగంగా విస్తరిస్తోంది. బుధవారం ఒక్క రోజే పట్టణం మండలంలో 76 పాజిటివ్ కేసులు నమోదయినట్లు వైద్యులు పేర్కొన్నారు. సింగరేణి ఏరియా కోవిడ్ పరీక్ష కేంద్రంలో బుధవారం 27 మందికి కారోనా ర్యాపిడ్ టెస్టులు చేయగా 15 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఉద్యోగులు 6, కుటుంబ సభ్యులు 7, కాంట్రాక్టు ఉద్యోగులు ఇద్దరికీ పాజిటివ్‌లు వచ్చినట్లు యాజమాన్యం తెలిపింది. ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన టెస్టుల్లో 35 మందికి, రొంపేడు ప్రాథమిక పాఠశాలలో పరీక్షలు నిర్వహించగా 19 మందికి, కొమరారం వైద్యశాలలో నిర్వహించిన కోవిడ్ టెస్టుల్లో ఏగుడురికి పాజిటివ్ కేసులు వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు.
క్వారంటైన్ లేకుండా రోడ్లపైకి..
పాజిటివ్ లు వచ్చిన వారు ఇంట్లోనే 7 రోజుల వరకు క్వారంటైన్లో ఉంటూ మందులు వాడాలి. కానీ అలా కాకుండా వివిధ పనులపై రోడ్లపైకి వస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. దీనికితోడు కూరగాయల మార్కెట్, బ్యాంకులు, కిరాణా, చికెన్, మాంసం హోటల్, బస్టాండ్లు, వివిధ కూడళ్ళలో ప్రజలు, వ్యాపారులు అత్యధికంగా మాస్కులు పెట్టుకోవడం లేదు. అసలే వైరస్ ఉధృతి స్పీడ్ గా ఉంది. దీంతో బాధితులు, వ్యాపారులు, ప్రజల తీరుతో మరింత రెట్టింపవుతోంది. మాస్కులు ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానా అంటూ ప్రభుత్వం హడావుడి చేసింది. పోలీసు మున్సిపాలిటీ శాఖలు ఈ బాధ్యత చేపడతాయని తెలిపింది. ప్రభుత్వం ప్రకటించి 15 రోజులు అవుతున్నప్పటికీ మున్సిపాల్టీ పోలీస్ శాఖలు యజమానులకు జరిమానా విధించిన దాఖలాలు లేవు. కట్టడికి వైద్యశాఖ ప్రచారం కూడా ఏమి చేయడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు పోలీసు మున్సిపల్ అధికారులు స్పందించి వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.