Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కరోనా నియంత్రణ నియమాలు తప్పక పాటించాలి : జీఎం జక్కం.రమేష్
నవతెలంగాణ-మణుగూరు
బొగ్గు ఉత్పత్తిలో యంత్రాలు అదనపు శక్తిగా ఉపయోగపడుతాయని ఏరియా జనరల్ మేనేజర్ జక్కం.రమేష్ అన్నారు. బుధవారం మణుగూరు ఏరియా పికేఓసి బేస్ వర్క్ షాపు నందు రెండు భారీ యంత్రాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో పారిశ్రామిక ప్రగతి అంతగా లేని కాలంలో బొగ్గు ఉత్పత్తి కేవలం కార్మికుల శ్రమ శక్తి మీద ఆధారపడి జరిగేదన్నారు. ప్రస్తుత కాలంలో బొగ్గు ఆదారిత పరిశ్రమలు, విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు పెరిగాయి, కావునా వాటి అవసరాలు తీర్చేలా డిమాండుకు తగ్గ బొగ్గు ఉత్పత్తి జరగాలంటే కేవలం శ్రామికుల కృషి సరిపోదు,కాబట్టి సింగరేణి యాజమాన్యం డిమాండుకు తగ్గ బొగ్గు ఉత్పత్తి చేసేందుకు తక్కువ కాలంలో ,తక్కువ సంఖ్యలో కార్మికులతో ఎక్కువ ఉత్పత్తి చేసేందుకుగాను శ్రమ శక్తికి యాంత్రిక శక్తిని జోడించి బొగ్గు ఉత్పత్తిలో అద్భుత ఫలితాలు సాధించడం జరుగుతుందన్నారు. పికేఓసి అవసరాలు తీర్చేందుకు గాను భారత్ యెర్త్ మువేర్స్ లిమిటెడ్ (బిహెచ్ఈఎల్) ఒక కోటి ఇరవై రెండు లక్షల ఎనబై ఒక్క వేల రైపాయాలు చెల్లించి టైర్ హాండ్లర్,ఒక కోటి తొంబై లక్షల రూపాయాలు చెల్లించి మోటార్ గ్రేడర్‌ను కొనుగోలు చేశామన్నారు. బొగ్గు ఉత్పత్తికి పరోక్షంగా సహాయపడతాయి, కావునా వీటిని నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తగా నడుపుకుంటూ సకాలంలో మెంటైన్ చేయడం ద్వారా వాటి జీవిత కాలాన్ని పెంచాలని సూచించారు.అనంతరం కరోనా మూడవదశ ఒమిక్రాన్ రూపంలో ఎంతగానో విజృంభిస్తుంది, కావునా సింగరేణియులు వారి కుటుంబసభ్యులు, కాంట్రాక్టు కార్మికులందరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఎవరికైన దగ్గు, జలుబు, జ్వరం వంటి ప్రాథమిక లక్షణాలు కనిపించిన యెడల సింగరేణి ఏరియా ఆసుపత్రి క్వారంటైన్ సెంటర్లో సరియైన చికిత్స చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో లలిత్‌కుమార్, ఫ్రీట్జాల్డ్, వెంకటేశ్వర్లు, లక్ష్మీపతి గౌడ్, వెంకటరమణ, నర్సిరెడ్డి, రమేష్, సురేష్, బోగ.వెంకటేశ్వర్లు, రామకృష్ణారెడ్డి, రాముడు,శ్రీనీవాస్, అబ్దుల్ షబీరుద్దిన్, ప్రభాకర్‌రావు, అబ్దుల్ రావూఫ్, ఉన్నత అధికారులు, బిహెచ్ఈఎల్ అధికారులు, బేస్ వర్క్ సాపు ఆపరేటర్లు, టెక్సీషియన్లు,తదితరులు పాల్గొన్నారు.