Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మంత్రి పువ్వాడ అజరు కుమార్
నవతెలంగాణ-ఖమ్మం
నగర ప్రజలకు అవసరమైన అన్ని మౌళిక సదుపాయాల కల్పనలో భాగంగా, నగర సుస్థిర ప్రగతి సాధనకు అత్యాధునిక పద్ధతులతో సి.సి రోడ్లు నిర్మించామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ చెప్పారు. బుధవారం పట్టణంలోని రూ.94.50 లక్షలతో 53వ డివిజన్ సహకారనగర్ రూ.20 లక్షలు, 23వ డివిజన్ విద్యానగర్ కాలనీ రూ.11 లక్షలు, 18వ డివిజన్ శ్రీరాంనగర్ రూ.15 లక్షలు, 17వ డివిజన్ శ్రీనివాస్ నగర్లో రూ. 48.50 లక్షలతో నిర్మించిన సి.సి రోడ్లను నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రత్యేక చొరవతో నగరాన్ని పటిష్టంగా రూపుదిద్దడం జరిగిందని, ప్రతి డివిజన్లో ఇది వరకెన్నడు లేని విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో (వీడిఎఫ్) వ్యాక్యూమ్ డ్రై స్పెషల్లీ లెయిడ్ కాంక్రీట్ పద్ధతిన సి.సి రోడ్లను నిర్మించామన్నారు.
ఈ కార్యక్రమంలో డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మీ ప్రసన్న, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, పబ్లిక్ హెల్త్ ఇ.ఇ రంజిత్‌కుమార్, కార్పోరేటర్లు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.