Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడేండ్లు అయినా పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ- కల్లూరు
పెద్దకోరుకోండి సబ్ స్టేషన్కు 33 కెవి విద్యుత్ లైన్ నిర్మాణం చేపట్టి మూడు సంవత్సరాలు గడిచినా నిర్మాణం పూర్తి కాకపోవటంతో 20 గ్రామల ప్రజలకు విద్యుత్ సమస్యలు తప్పటం లేదు. విద్యుత్ సమస్యలు తీర్చేందుకు పెద్దకోరు కొండిలో సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టడం జరిగింది. విద్యుత్ సబ్ స్టేషన్కు తల్లాడ నుండి 33 కెవి లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. తల్లాడ, నుండి కుర్నవల్లి నుండి పెద్దకోరుకొండికి విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారు. ఈ రెండు సబ్స్టేషన్లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా పెద్దకోరుకొండి సబ్ స్టేషన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఈ విధంగా ప్రజలు విద్యుత్ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో పెనుబల్లి సబ్ స్టేషన్ 220 కె వి నుండి పెద్దకోరుకొండి సబ్ స్టేషన్కు 33 కెవి విద్యుత్ లైను నిర్మాణానికి 2019 జనవరిలో నిధులు మంజురు కాగా అదే నెలలో శంకుస్థాపన చేశారు. పనులు చేపట్టిన కాంట్రాక్టు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వాటి కాసారాలు ఏర్పాటు చేశారు. కానీ విద్యుత్ సరఫరా అయ్యే విద్యుత్ లైన్ తీగలను లాగ లేదు. దీంతో మూడు సంవత్సరాలు గడిచినా అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. తరచూ విద్యుత్ సమస్యలతో సబ్ స్టేషన్నకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్య జోక్యం చేసుకుని వెంటనే నిర్మాణం పూర్తిచేసి విద్యుత్ సమస్య తీర్చాలని 20 గ్రామాల ప్రజల కోరుతున్నారు.