Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
కార్మిక, కర్షక ఐక్య ఉద్యమాలు ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తాళ్ళపల్లి కృష్ణ అన్నారు. బుధవారం కొణిజర్ల మండలం సింగరాయపాలెం గ్రామంలో రైతు, కార్మిక సంఘాల పిలుపు మేరకు తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక, కర్షక మైత్రీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పోరేటీకరణ విధానాలు దేశ ప్రజలకు భద్రత లేకుండా చేస్తుంది అని అన్నారు. ప్రజలకు న్యాయం జరగాలంటే కార్మిక కర్షక ఐక్య ఉద్యమాలు ద్వారా మాత్రమే సాధ్యం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో 21న ఖమ్మం హార్టికల్చర్ ఆఫీస్ వద్ద జరిగే రైతు ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి ఎరమల్ల మాధవరెడ్డి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అనుమోలు రామారావు, రైతు సంఘం మండల నాయకులు దొడ్డపనేని కృష్ణార్జున్రావు, మిద్దె రామారావు, గాదె వెంకటరెడ్డి, వెంకటేశ్వరరావు, సత్యం, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.