Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం నగరంలోని బ్రాహ్మణ బజారులో వక్షం కూలి మంగళవారం మృతి చెందిన చెందిన ఇద్దరు చిన్నారుల కుటుంబ సభ్యులను బుధవారం నగర మేయర్ పునుకొల్లు నీరజ పరామర్శించారు. అనంతరం ఖమ్మం కాల్వొడ్డులోని వైకుంఠ ధామంలో దగ్గర ఉండి చిన్నారి ఆయుష్ అంత్యక్రియలను నిర్వహించారు. అక్కడ నుండి కిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న సాయిచరణ్‌ను పరామర్శించారు. తల్లిదండ్రులకు ధైర్యాన్ని చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అనంతరం దినేష్ శెట్టి పార్ధివదేహాన్ని సొంత ఊరు ఉడిపి వెళ్ళటానికి పలు సహాయ కార్యక్రమాల్ని దగ్గర ఉండి నగర మేయర్ నీరజ చేశారు,