Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దాతకు సన్మానం
నవతెలంగాణ-ఎర్రుపాలెం
ప్రభుత్వ పాఠశాల అదనపు తరగతి గదిని మండల పరిషత్ అధ్యక్షురాలు దేవరకొండ శిరీష బుధవారం ప్రారంభించారు.ఎర్రుపాలెం మండల పరిధిలోని తెల్లపాలెం గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అదనపు గది నిర్మాణానికి వైయస్సార్ ఫౌండేషన్, గ్రామస్తులు శీలం హరేందర్ రెడ్డి సహకారంతో తరగతి గదితో పాటు ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో సుమారు 12 లక్షల రూపాయల ఖర్చుతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. పాఠశాల తరగతి గదిని శీలం హారేంద్రరెడ్డి ప్రారంభించి ఆయన మాట్లాడుతూ సొంత ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. తెల్లపాలెం గ్రామంలోని పూర్వ విద్యార్థుల ఆర్థిక సహకారంతో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడం పట్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారి వాసిరెడ్డి అశోక్ కుమార్ దాతలను అభినందించారు. మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ మండలంలో గల పాఠశాలలో తెల్లపాలెం పాఠశాల విద్యా ప్రగతిలో ముందుందని అన్నారు. కార్యక్రమంలో జెడ్పిటిసి శీలం కవిత, గ్రామ పంచాయతీ సర్పంచ్ పెరుగు రామకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కంచర్ల శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, శిరీష, ఎస్ఎంసి చైర్పర్సన్ రామకృష్ణ, వైస్ చైర్మన్ వేమిరెడ్డి శిరీష, గ్రామస్తులు ఆవుల ముత్తయ్య, దాతలు సీతారామరాజు, లక్ష్మారెడ్డి, వేమిరెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.