Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభివృద్ధికి సింగరేణి సంస్ధ నిధులు మంత్రి పువ్వాడ అజరుకుమార్
నవతెలంగాణ-కారేపల్లి
ప్రభుత్వంకు ఎంత కష్టం వచ్చిన రైతు విషయంలో రాజీ పడటం లేదని రాష్ట్ర రవాణాశాఖామంత్రి పువ్వాడ అజరుకుమార్ అన్నారు. కారేపల్లి మండలం గేటుకారేపల్లి తోటకూరి పిచ్చయ్య గృహంలో బుధవారం వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రైతు బంధు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి గింజను కొనుగోలు చేయటం జరుగుతుందని మంత్రి తెలిపారు. సింగరేణి కాలరీస్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ఆ సంస్ధ నుండి రావల్సిన నిధులను మంజూరు చేయిస్తానన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నప్పుడు సింగరేణి సంస్ధ అభివృద్ధి నిధులను ఒకే బ్యాంకు ఖాతాలో జమచేసేదని దీంతో ప్రభావిత గ్రామాల అభివృద్ధికి ఆ నిధులను సమానంగా కేటాయించటం జరిగిందన్నారు. నూతనంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఏర్పాటు తో ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ప్రాంతానికి నిధులు వెళ్ళుతున్నాయన్నారు. ఈ విషయమై సింగరేణి మైన్స్ జీఎంతో చర్చించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానన్నారు. ఈకార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, ఎంపీపీ మాలోత్ శకుంతల, జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సంత ఆలయం చైర్మన్ మల్లెల నాగేశ్వరరావు, రైతు బంధు కన్వీనర్ గుగులోత్ శ్రీను, టీఆర్ఎస్ మండల అధ్యక్షప్రధాన కార్యదర్శులు తోటకూరి రాంబాబు, అజ్మీర వీరన్న, ఎంపీటీసీ సంఘం అధ్యక్షులు దారావత్ పాండ్యానాయక్, పెద్దబోయిన ఉమాశంకర్, యూత్ అధ్యక్షులు అజ్మీర యుగేంధర్, సర్పంచ్‌లు భూక్యా కల్పన, మాలోత్ కిషోర్, కోఆప్షన్ ఎండీ.హనీఫ్, నాయకులు తోటకూరి పిచ్చయ్య, దాచేపల్లి కృష్ణారెడ్డి, తోటకూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.