Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతులకు అవగాహన
నవతెలంగాణ-ఎర్రుపాలెం
మామిడి పంటలను ఆశించిన తేనె మంచు పురుగు, పండు ఈగ, తామర పురుగు, బూడిద తెగులు, నివారణ చర్యల గురించి రైతులకు అవగాహన కల్పిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు చూపించారు. జమలాపురం గ్రామంలో గల రైతు వేదిక వద్ద వ్యవసాయ శాఖ ఉద్యాన వనశాఖ ఆధ్వర్యంలో మామిడి తోటలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యల గురించి మధిర ఉద్యాన శాఖ అధికారి ఆకుల వేణు రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేనె మంచు పురుగు నివారణకు ఇమిడా క్లో ప్రిడ్ 5 ఎం ఎల్ లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు.తామర పురుగు నివారణకు ఫిప్రొ నిల్ లేదా డైమితో యేట్ 2ఎంల్ లీట రు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని వీటితో పాటు వేపనూనెను వాడుకోవచ్చు అని తెలిపారు. పండు ఈగ నివారణకు మితేల్ యూజినాల్ కలిగిన ఆకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి అన్నారు. పండు ఈగ నివారణకు మార్కెట్లో నూతనంగా మితేల్ యూ జి నాల్ జెల్ అందుబాటులోకి వచ్చిందని, దానిని చెట్ల కాండంకు పూయడం ద్వారా పండు ఈగ నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో విస్తరణాధికారి జిష్ణు, రైతులు తుళ్లూరు సీతారామయ్య, వాసిరెడ్డి దుర్గాప్రసాద్, నన్నపనేని రామారావు, వేముల వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.