Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమలాయపాలెం
వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు కొత్త పింఛన్లులు వెంటనే మంజూరు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను డిమాండ్ చేశారు. మేడిపల్లి గ్రామంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం మోర ఉపేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకొని మూడు సంవత్సరాలు కావస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు కొత్త పెన్షన్ మంజూరు చేయలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్న పట్టించుకునే నాధుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోతే ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. గ్రామ గ్రామాన అందర్నీ చైతన్యవంతం చేసి ఉద్యమం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు అంగిరేకుల నరసయ్య, మండల కమిటీ సభ్యులు బందారపు సైదులు, సిఐటియూ మండల కన్వీనర్ వసపొంగు వీరన్న ,మోర ఉపేందర్‌రెడ్డి, గ్రామ శాఖ కార్యదర్శి మాచర్ల రాజశేఖర్, సభ్యులు అహ్మద్, కరుణాకర్ రెడ్డి, వెంకట్రామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.