Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
హైదరాబాద్లోని ప్రగతిభవన్లో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ను పద్మశ్రీ అవార్డు గ్రహిత వనజీవి రామయ్య, జానమ్మ దంపతులు బుధవారం కలిసిశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితనిధి కార్యక్రమాలపై చర్చించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతం కావాలని, ప్రకృతి దీవెనలు ఉండాలని వనజీవి దంపతులు ఆకాంక్షించారు. వనజీవి దంపతులకు ఎంపీ పాదాభివందనం చేశారు. ఏడు పదుల వయస్సులోనూ నిత్య ఉత్సాహంతో పర్యావరణం కోసం కృషి చేస్తున్న వనజీవి రామయ్య దంపతులను కలవడం ఆనందంగా ఉందని సంతోష్ కుమార్ పేర్కొన్నారు. రామయ్య ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఎలాంటి వైద్యం అవసరమైనా తనను సంప్రదించాలని, తానే బాధ్యత తీసుకుంటానని ఎంపీ హామీ ఇచ్చారు. నాటేందుకు, పంపిణీకి అవసరమైన మొక్కలను కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరుపున అందించేందుకు తాను సిద్ధమని ఎంపీ సంతోష్ కుమార్ పేర్కొన్నారు. వనజీవి దంపతుల వెంట వైద్యులు రాజశేఖర్ గౌడ్, సుజనా గౌడ్ ఉన్నారు.