Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభినందించిన 'హెటెరో' ఛైర్మెన్ పార్ధసారధిరెడ్డి
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం గంగారం సాయిస్పూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ విభాగాధిపతి పాముల శేఖర్‌బాబుకు జేఎన్టీయూ కాకినాడ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. బోనకల్ మండలం, మోటమర్రి గ్రామంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన పాముల సుబ్బారావు, పుష్పలతల కుమారుడు శేఖర్‌బాబు జేఎన్టీయూహెచ్లో బీటెక్ పూర్తి చేసి, మైక్రోవేవ్ ఇంజనీరింగ్‌పై విజయవాడలో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం శేఖర్‌బాబు ఆచార్యులు డాక్టర్ పీవీ నాగాంజనేయులు, డాక్టర్ సత్యప్రసాద్ పర్యవేక్షణలో 'పెర్ఫార్మెన్స్ అనాలసిస్ అండ్ వాల్యూయేషన్ ఆఫ్ మిమో మల్టీ ఛానల్ ఆప్టిమైజ్డ్ బీమ్ ఫార్మింగ్ సిస్టమ్స్' అనే సిద్ధాంతంపై పరిశోధనలు చేసి విజయవంతమైన ఫలితాలు రాబట్టినందుకు జేఎన్టీయూ కాకినాడ యూనివర్శిటీ శేఖర్‌బాబుకు డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. శేఖర్‌బాబు పరిశోధనలను అంతర్జాతీయ టెక్నికల్ జర్నల్స్‌లో ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. తమ కళాశాల ఫ్యాకల్టీ డాక్టరేట్‌ను పొందడం ఆనందంగా ఉందని కళాశాల ఛైర్మెన్, హెటెరో డ్రగ్స్ అధినేత డాక్టర్ బండి పార్ధసారధిరెడ్డి ఆన్లైన్లో జరిగిన సమావేశంలో అభినందించారు. కళాశాల సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ దాసరి ప్రభాకర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ చెన్నుపాటి విజరుకుమార్, వైస్ ప్రిన్సిపాల్ వీఎస్ రత్నకుమారి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది, విద్యార్ధులు శేఖర్‌బాబును అభినందించారు. శేఖర్‌బాబు డాక్టరేట్ పొందడంపై మోటమర్రి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.