Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తడి పొడి చెత్తతో కంపోస్టు :
నాణ్యమైన సేంద్రియ
అ ఎరువుల తయారీ : మున్సిపాలిటీకి
ఆదాయ వనరు
అ చైర్మెన్ డివి కృషి : ప్రజల సహకారం
అ రాష్ట్రంలోనే రోల్ మోడల్‌కు అడుగులు
నవతెలంగాణ-ఇల్లందు
ఒక లక్ష్యం అంటూ ఉండాలే గాని ఏదైనా సాధించవచ్చు. చిత్తశుద్ధి, పట్టుదల, నిరంతర శ్రమతో ముందడుగు వేస్తున్న మున్సిపాలిటీ చైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణంలో పరిశుభ్రతలో ముందుకు సాగుతోంది. ఎన్నో విజయాలు సాధించి చివరికి స్వచ్ఛ సర్వేక్షన్ సర్వేలో దక్షిణ భారతదేశంలో 19 తెలంగాణ రాష్ట్రంలో 8 స్థానంలో నిలిచింది. ఉమ్మడి జిల్లాలో ఏ మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయిలో అమలుకాని పథకం తడి, పొడి చెత్తతో కంపోస్టు ఎరువురు తయారీ విధానం. దీనికోసం మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు నడుము కట్టారు. వివరాల్లోకి వెళితే... గతంలో ఇల్లందు పట్టణంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, దిబ్బలు దిబ్బలుగా పేరుకుపోయి, తీవ్ర కాలుష్యానికి, అనారోగ్యానికి కారణమయ్యేది. ఇది గతం మాట. మరి ఇప్పుడు మున్సిపల్ కార్మికులు ప్రతిరోజు ప్రతి ఇంటిలోని చెత్తను సేకరిస్తున్నారు. చెత్తను సేకరించి, సేంద్రియ ఎరువుగా తయారు చేస్తోంది ప్రస్తుత పాలక వర్గం. పట్టణ ప్రజల సహకారంతో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వడం ద్వారా వారు వాహనాల్లో వర్మీ కంపోస్ట్ షెడ్డుల్లో తడి చెత్త, పొడి చెత్త రెండు భాగాలుగా విభజిస్తున్నారు. ఆ తరువాత కంపోస్ట్ ఫిట్లలో ఆవు పేడ, వానపాములను కలిపి ఎరువుగా మార్చి ఆ ఎరువులను విక్రయించడం ద్వారా మున్సిపాలిటీ కూడా ఆదాయ వనరులు పెరుగనున్నాయి. తడి పొడి చెత్త ప్రతిరోజు మున్సిపాలిటీ కార్మికులు సేకరి స్తున్నారు. ఇంట్లో తయారైన చెత్తను పోగుచేసి ప్రజలు ఇస్తున్నారు. ఇది ఏమవుతుంది ఎక్కడ పోస్తు న్నారు ఏం జరుగుతోంది అనేది ప్రజలకు తెలియదు. తడి పొడి చెత్త ద్వారా కంపోస్టు ఎరువుగా తయారయ్యే విధానం నవతెలంగాణ అందిస్తోంది.
మొదటి దశ : ఇంటింటా చెత్తను సేకరించడం
ఇంటింటా చెత్తను పారిశుధ్య కార్మికులు సేకరిస్తున్నారు. వారు మున్సిపాలిటీ వాహనాలలో తడి, పొడి చెత్తను వేరు వేరుగా సేకరిస్తూ, డంప్ యార్డులకు తరలించడం.
రెండవ దశ : డంప్ యార్డ్‌లో వేరు చేయడం
పారిశుధ్య కార్మికులు ప్రతిరోజు ఇంటింటా సేక రించిన చెత్తను డంప్ యార్డ్‌లో వేసి, తర్వాత తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేస్తున్నారు. తడి చెత్తలో మి గిలిన అన్నం, పాడైపోయిన కాయగూరలు, పండ్లు వాటిని వేరుగా సేకరిస్తున్నారు. పొడి చెత్తగా ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్, గాజు సీసాలు, ప్లాస్టిక్ వస్తువులను సేకరించి తరువాత వేరువేరుగా సెపరేట్ చేస్తున్నారు.
మూడవ దశ : సేంద్రియ ఎరువు తయారీ
సెగ్రిగేషన్ షెడ్డు లో రెండు కంపోస్ట్ ఫిట్ లను ఏర్పాటు చేశారు. అయితే ముందుగా ఈ సేంద్రియ ఎరువును ఒక పద్ధతి ప్రకారం తయారు చేయాల్సి ఉంటుంది. ఒక ఫీట్ వరకు ఎండిన కొబ్బరి పీచు, దానిపైన మరో ఫీట్ నల్లమట్టి పోస్తారు. దానిపై ఎండిన చెట్లు, ఆకులు, ఎండుగడ్డి, సోయా లేదా నూర్పిడి ద్వారా వచ్చే కంది వేస్తారు. ఇక దానిపైన ఆవు పేడను నీటిలో కలిపి చల్లుతారు. ఇక దాని తర్వాత సేకరించిన కుళ్ళిన కాయగూరలు, అన్నం, పండ్లు తదితర తడి చెత్తను వేస్తారు. ఇలా ప్రతిరోజు ఫీట్ కిందకు నీళ్లు దిగే వరకు మూడు సార్లు నీటిని చల్లుతారు. ఇలా ప్రతి రోజూ చేస్తూ ఉండడం వల్ల 15 రోజుల అనంతరం నీరు కింది వరకు దిగి, కుళ్ళిపోయి మొత్తం ఎరువుగా తయారవడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. ఆ తరువాత ఈ వర్మీ కంపోస్ట్ ఫిట్‌లో వానపాములు వదిలి, అవి బయటకు వెళ్ళిపోకుండాపై నుంచి గోనే సంచులు కప్పుతారు. ఇలా మరో పదిహేను రోజుల తర్వాత నుంచి ఎరువు తయారవడం ప్రారంభమవుతుంది.