Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వ్యాధి గ్రస్త కార్మికులకు సౌకర్యాలు కరువు
అ ఇది సింగరేణి సంస్థ ''ఒకే కుటుంబ లక్ష్యం'' నినాదం
నవతెలంగాణ-కొత్తగూడెం
ఒకే కుటుంబం.. ఒకే లక్ష్యం...ఒకే గమ్యం ఇది సింగరేణి సంస్థ నిరంతర సూక్తి, కానీ, ఈ సూక్తిలో ఉన్న ఏ ఒక్కటీ ఆచరించడంలేదని తెలుస్తుంది. సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తి మీద కేంద్రీకరించిన దృష్టి కార్మికుల కంక్షేమం మీద చూపడం లేదని విమర్శలున్నాయి. మరీ రిటైర్డ్ అవుతున్న కార్మికుల విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.
సింగరేణి సంస్థలో 30 సంవత్సరాల పాటు రక్తాన్ని చెమటగా మార్చి సంస్థ అభివృద్ధికి పాటుపడ్డ కార్మికులు అనారోగ్య సమయంలో మెడికల్ బోర్డు చేయించుకోవడానికి వస్తే వారికి సరైన సౌకర్యాలు కల్పించకపోవడంలో చిన్న చూపు చూస్తుంది. ఒకే కుటుంబం అన్న నినాదాం కార్మికుల పక్షాన సంస్థ ఏ విధంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుంది. ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన బొగ్గుగని కార్మికులు మెడికల్ బోర్డు చేయించుకోవడానికి కొత్తగూడెం వస్తే వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించడంలేదు. ప్రతి నెల మెడికల్ బోర్డు కార్యక్రమాన్ని కొత్తగూడెం సింగరేణి ప్రధాన వైద్యశాలలో నిర్వహిస్తుంటారు. దరఖాస్తు చేసుకున్న ఆరు జిల్లాల చీకటి సూర్యులు ఇక్కడికి రావాలి. 30 సంవత్సరాలు చేమటోర్చి 55 సంవత్సరాల తర్వాత వయోభారం, అనారోగ్యం పాలై...మమ్ములను అన్‌ఫిట్ చేసి మా కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని కార్మికులు సంస్థకు దరఖాస్తు చేసుకుంటారు. ఇందులో పక్షవాతం, గుండె జబ్బు, అంగవైకల్యం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కార్మికులు ఎక్కువగా హాజరవుతారు. మెడికల్ బోర్డు సమయంలో వచ్చే కార్మికులకు సౌకర్యాలు కల్పించడంలో సంస్థ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శలు ఉన్నాయి. అపరిశుభ్ర వాతావరణం, కూర్చునేందుకు కుర్చీలు లేదు, తాగేందుకు మంచినీరు లేదని బాధిత కార్మికులు మండ ిపడుతున్నారు. కోవిడ్ నింబధనలు ఏమాత్రం కనిపించలేదని వాంటున్నారు. ఈ విషయలో యాజమాన్యం చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదని ఆరోపనలు మూటగట్టుకుంటున్నారు. వీరు మన సంస్థకు చెందిన వారు కాదని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస జీవులని, లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను చూస్తున్నట్టు తెలుస్తోంది. మెడికల్ బోర్డుకి వచ్చిన అనారోగ్యంతో ఉన్న వారిని చెత్తాచెదారం పేరుకుపోయిన ప్రాంతాల్లో వారిని ఉంచడం పలు విమర్శలకు దారితీస్తుంది. అసలు వ్యాధి బారిన పడి పడి ఉన్న వారిని మురుగు, చెత్త పోగుచేసిన ప్రాంతంలో ఉంచడం సరికాదని కార్మికుల కుటుంబ సభ్యులు తప్పుపడుతున్నారు. ప్రస్తుతం కరోనా థర్డ్‌వేవ్ విస్తృతంగా విజృంభిస్తున్న ప్రమాదకర పరిస్థతిలో ఆనారోగ్యంతో ఉన్న కార్మికులను ఇలాంటి వాతావరణంలో ఉంచడం సిగ్గుచేటంటున్నారు. ఈ కార్మికుడు మన సంస్థ కోసం అనేక ఏళ్లుగా కృషి చేశాడని...సంస్థ అభివృద్ధికి పాటుపడ్డాడని... కనీస విజ్ఞత లేకుండా ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని కార్మికులు మండి పడుతున్నారు. మాజమాన్యానికి ఒకే బొగ్గు ఉత్పతి లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది తప్పా. కార్మిక సంక్షేమం ఏమాత్రం కనిపించడంలేదని తెలుస్తుంది. ఈ విషయంలో కార్మిక సంఘాలు స్పందించాలని వారు కోరుతున్నారు.