Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ముదిగొండ
కరోనా వైరస్ మూడోదశ వేగంగా విస్తరిస్తోందని మండల ప్రజలు అప్రమత్తమై మాస్కు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎంపీడీవో ధరావత్ శ్రీనివాసరావు అన్నారు. కరోనా మూడో దశ పెరగటంపై జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్లో మండల అధికారులతో పాటు ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తామన్నారు. కరోనా స్వల్ప లక్షణాలు కనిపించిన ఐసోలేషన్ కేంద్రంలో ఉండాలన్నారు. మాస్కు ధరించి కరోన నిబంధనలలు పాటించాలన్నారు.కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు. వ్యాక్సినేషన్ రెండోసుతో పాటు బూస్టర్ డోస్ వేగవంతం చేయాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో కరోనా కిట్టు అందుబాటులో ఉంటుందన్నారు.వైద్య అధికారులతోపాటు ఆశ వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉండాలన్నారు. కాన్ఫరెన్స్లో మండల తాసిల్దార్ తూమాటి శ్రీనివాస్,ఎస్సై తోట నాగరాజు, ఎంపిఓ పి సూర్యనారాయణ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.