Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మున్సిపాల్టీలలో ఇండోర్ కోర్టులు
ఏర్పాటు చేయాలి
అ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియోషన్
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో షటిల్ ఆటను ఆడే క్రీడాకారులు చాలా మంది ఉన్నారని, ఇండోర్ స్టేడియం లేకపోవడం వల్ల క్రీడాకారులు మైదాన ప్రాంతంలోనే ఆడుకోవాల్సికోవాల్సిన పరిస్థితి ఉన్నదని, మున్సి పాలిటీలలో ఇండోర్ కోర్టులు ఏర్పాటు చేయాలని షటిల్ బ్యాడ్మింటన్ అసోసియోషన్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం జిల్లా డీఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మైదాన ప్రాంతంలో ఆడటం వల్ల మన జిల్లా నుండి ప్రతిభ ఉన్న క్రీడాకారులలు జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనడానికి అవకాశం లేకుండా పోతుందని తెలిపారు. మన జిల్లా నుండి క్రీడా పోటీలలో వెనుకపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. గతంలో పలుమార్లు ఇండోర్ కోర్టు ఏర్పాటు కొరకు ప్రతిపాదనలు అందచేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని, కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి క్రీడాకారును ప్రోత్సహించే విధంగా జిల్లాలోని అన్ని మున్సిపాల్టీలలో, అవాకాశం ఉన్న ఇతర ప్రాంతాల్లో ఇండోర్ షటిల్ కోర్టులు నిర్మించాలని, జిల్లా నుండి షటిల్ క్రీడల్లో జాతీయ స్థాయిలో రానించే క్రీడాకారులను ఎదిగేలా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియోషన్ బాధ్యులు శీలం శ్రీనివాసరావు, డాక్టర్ చారుగుండ్ల రాజశేఖర్ అయ్యప్ప, తుత్తురు దామోదర్, ధారావత్ రమేష్, తెలుకుంట్ల రమ్కుమార్, యెర్రా ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.