Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ తాగునీటి పథకం కుర్నపల్లి ఆదివాసి గ్రామానికి అందని ద్రాక్షలా ఉందని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి సరైన కోటేశ్వర రావు విమర్శించారు. శుక్రవారం మండల పరిధిలోని కుర్నపల్లి గ్రామాన్ని టీఏజీఎస్ ప్రతినిధి బృందం పర్యవేక్షించి నీటి సమస్యపై ఆయన ధ్వజమెత్తారు. కుర్నపల్లి గ్రామంలో మిషన్ భగీరధ మంచి నీరు వేశవిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పైపులైన్ ఆలంకార ప్రాయంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. చూడటానికి మిషన్ భగీరథ పైప్ లైన్ మినహా చుక్కనీరు ఆదివాసి ప్రజలకు రావడం లేదని ఆయన నిప్పులు చెరిగారు. శుక్రవారం గ్రామంలో పర్యటించి మంచినీటి పైపు లైనర్లు పరిశీంచారు. నీరు రావడంలేదని మిషన్ భగీరధ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. అధికార యంత్రాంగం వెంటనే స్పందించి సమస్య తక్షణమే పరిష్కరించాలన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమస్యపై దృష్టి సారించి సమస్య పూర్తిగా పరిస్కరించాలని ఆయన కోరారు. లేకపోతే ప్రజాపోరాటాలకు వెనకాడబోమని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఏజీఎస్ జిల్లా నాయకులు కారం నరేష్, చుక్కమ్మ, శివ తదితరులు పాల్గొన్నారు.