Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
యువత క్రీడల పట్ల ఆసక్తి కనబర్చాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాలరావు అన్నారు. మండల కేంద్రమైన ములకలపల్లిలో పాత్రికేయులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా శుక్రవారం విజేత జట్టుకు బహుమతులు అందజేశారు. ఈ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై తన హిమజా ట్రస్టు ద్వారా విజేతగా నిలిచిన సర్పంచ్ల జట్టుకు రూ.30 వేల నగదు, షీల్డ్ అందించారు. అలాగే రన్నరప్‌గా నిలిచిన టీచర్స్ ద్వితీయ బహుమతి రూ.15 వేల అందజేశారు. క్రీడలు ఎంతో ఉల్లాసం ఇస్తాయని ఇలా అధికారులు, ప్రెస్, సెక్రటరీలు టీములుగా ఏర్పడి ఆడటం ఎంతో సంతోష దగ్గ విషయమన్నారు. జిల్లాలో ఎక్కడా లేని ఆటలు ములకలపల్లి మండలం ఉండటం ఎంతో ఆదర్శంగా ఉందని త్వరలో ఇలాంటి క్రీడలు కొత్తగూడెంలో కూడా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మట్ల నాగమణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, ఎంపీడీవో నాగేశ్వరరావు, ఎంపీటీసీ మహరామణి, సర్పంచ్‌లు, టీఆర్ఎస్, సీపీఐ(ఎం) నాయకులు తదితరులు పాల్గొన్నారు.