Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలోని ఎఎంసీ కాలనీకి చెందిన మోతుకూరి రాము, రమాదేవిల కుమారుడు మోతుకూరి తనూష్ గత ఏడేళ్లుగా సికిల్సెల్ ఎనిమియా వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆ చిన్నారికి శుక్రవారం సహృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో రూ.30 వేలు ఆర్థిక సహాయంను అందజేశారు. ఈ నగదుతో ప్రతి నెల తనూషకు వైద్య చికిత్స అందించేందుకు ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహృదయ ఫౌండేషన్ ఫౌండర్ తుళ్లుబేళ్ళు సునీత, ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ తోకల దుర్గా ప్రసాద్, కోట రవికుమార్, పౌండర్ నాగరాజు, భరత తరుణ్ పాల్గొన్నారు.