Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుజాతనగర్
నవతెలంగాణ విలేకర్లు వర్గదృక్పథంతో పాటు, అవినీతి, అక్రమార్కుల బరతం పట్టేవిధంగా వార్త కథనాలు రాయాలని 'నవతెలంగాణ' జనరల్ మేనేజర్ ఎం.సుబ్బారావు అన్నారు. శుక్రవారం సుజాతనగర్ సీపీఐ(ఎం) కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డెస్క్ ఇన్చార్జి వీరేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మీడియా రంగంలో అనేక మర్పులు వచ్చినప్పటికీ నవతె లంగాణ పేద, బడగు, కార్మిక, కర్ష, వర్గ దృక్పథంతో పనిచేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అధికార బలంతో అవినీతికి పాల్పడు తున్న రాజకీయ నాయకులు, అధికార దుర్వినియోగంతో అవినీతికి పాల్పడుతున్న అధికారుల అక్రమాలు బైటికి తీయాలన్నారు. నవతెలంగాణ విలేకర్లు రాసే వార్తా కథనాలు ప్రజల్లో చర్చ కావాలన్నారు. 2022 నూతన సంవత్సరం క్యాలండర్ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి కృషి చేసిన విలేకర్లు, సిబ్బందిని అభినందించారు.
అనంతరం చిన్నారి పిల్లల ఆసుపత్రి వైద్యులు కేవి.క్రిష్ణారావు అందించిన ఆర్థిక సహాయంతో బహుమతులను అందజేశారు.
ఎల్లో జర్నలిజానికి తావు లేదు : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య
నవతెలంగాణ విలేకర్లు ఇతర పత్రికల విలేకర్లకు భిన్నంగా వార్తా కథనాల కోసం పరిశీల చేయాలి. అవినీతికి పాల్పడే వారిని ఎండగట్టాలని, ఎల్లో జర్నలిజానికి తావులేకుండా పనిచేస్తున్న తీరును ప్రశంసించారు. సమాజంలో పత్రికా రంగంలో పెద్దఎత్తున పోటీ ఉందని, వాటిని ఎదుర్కొని నవతెలంగాణ పత్రిక అభివృద్ధికి పాటుపడుతున్న తీరును అభినం దించారు. భవిష్యత్తులో మరింత చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ ఎస్డి.జావీద్, మఫిషియల్ బాధ్యులు వేణుమాధవ్, ఇ.వెంకటేశ్వర్లు (ఇవి), ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడివిటి బాధ్యులు, విలేకర్లు పాల్గొన్నారు.