Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
మున్సిపాలిటీ పరిధిలోని 12, 13వ వార్డు ఆర్ అండ్ ఆర్ యూత్ ఆధ్వర్యంలో మూడు జిల్లాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలను మునిసిపల్ చైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ హరి సింగ్ నాయక్‌లు శుక్రవారం ప్రారంభిచారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమాలకు హరివాసము గ్రూప్ సభ్యులు పెండ్యాల హరికృష్ణ రూ.10,116 విరాళాన్ని అందజేశారు. కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాష, టీఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ ప్రెసిడెంట్ కొక్కు నాగేశ్వర రావు, వైస్ ప్రెసిడెంట్ గుండా శ్రీకాంత్, కౌన్సిలర్ కడ కంచి పద్మ, సిలీవేరి అనిత, ఇల్లందు టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.