Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే ప్రారంభం
అ డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వీరబాబు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం పట్టణంలో ఇంటి ఆరోగ్య కార్యక్రమం శుక్రవారం నుండి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, స్పెషలాఫీసర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వీరబాబు మాట్లాడుతూ ప్రతి ఇంటిని వైద్య సిబ్బంది సందర్శించి ఏమైనా కోవిడ్ లక్షణాలు ఉన్నట్లయితే వారికి ఓమ్ ఐసోలేషన్ కిట్ ఇచ్చి వైద్య సలహాలు అందించాలని ఆయన అన్నారు. ఐదు రోజుల జ్వరము తగ్గ నట్లయితే కోవిడ్ పరీక్ష చేయించుకుని వైద్యుల సమక్షంలో చికిత్స పొందవలెనని ఆయన అన్నారు. 15 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని, వేరే ప్రాంతం నుంచైనా రాష్ట్రం, జిల్లా నుంచి గాని కొత్తవారు వచ్చినట్లయితే వారికి లక్షణాలు ఉంటే వారిని గుర్తించి కోవిడ్ పరీక్ష చేసుకోవాలన్నారు. రెండవ రోజు బూస్టర్ డోస్ ఈనెల పూర్తయ్యేలోగా చూడాలని ఆయన అన్నారు. పట్టణంలో బ్రిడ్జి సెంటర్, ఏరియా ఆస్పత్రి, కంబాల పాడు, శిల్పి నగర్, భూపతి రావు కాలనీ, మారుతీ నగర్, ఎస్సార్ కాలనీలోని ఏరియాలో ఉప కేంద్రం వద్ద కోవిడ్ వ్యాక్సిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ సూపర్వైజర్ కృష్ణయ్య, సిహెచ్ఓ కాంతమ్మ, హెచ్.వి.సద్గుణ వాణి, వైద్య సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.