Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లో గత మూడు సంవత్సరాలుగా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న చిట్టి వీర వెంకట సూర్య సత్యనారాయణ (46) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ విధులకు దూరంగా ఉంటున్న సత్యనారాయణ మరణ వార్త తెలుసుకున్న దుమ్ముగూడెం సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు, స్టేషన్ సిబ్బంది నెల్లిపాక మండలంలోని వెంకటరెడ్డి పేట గ్రామంలో గల సత్యనారాయణ ఇంటికి వెళ్లి పార్థివ మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ యేసేబు, ఎస్ఐ సత్యనారాయణ మృతదేహాన్ని సందర్శించి జిల్లా పోలీస్ తరుఫున దహనసంస్కారాల నిమిత్తం రూ.20,000 కుటుంబసభ్యులకు అందజేశారు. సత్యనారాయణ కుటుంబానికి పోలీస్ శాఖ తరుపున చెందవలసిన అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తామని వారు కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. సత్యనారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.