Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎంపీపీ రేసు లక్మి
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గ్రామపంచాయతీ కార్యాల యాన్ని నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీపీ రేసు లక్ష్మి అన్నారు. శుక్రవారం చిన్న బండిరేవు గ్రామపంచాయతీలో రూ.20 లక్షలతో నిర్మించే నూతన గ్రామ పంచాయతీ కార్యాలయానికి జడ్పీటీసీ తెల్లం సీతమ్మతో కలిసి ఎంపీపీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లెల అభివృద్ధి కోసం చేపట్టిన పల్లె ప్రగతి పనులను చిన్న బండి రేపు గ్రామపంచాయతీలో సమర్థవంతంగా నిర్వహించి నందుకు గాను జిల్లా కలెక్టర్ ప్రోత్సాహక బహుమతిగా రూ.20 లక్షల అందజేయడం జరిగిందన్నారు. ఆ నిధులతో చేపడుతున్న గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మోడల్ గ్రామ పంచాయతీగా నిర్మించి ప్రజా సమస్యల పరిష్కారానికి కేంద్ర బిందువు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం.చంద్రమౌళి, ఎంపీఓ ముత్యాలరావు, సర్పంచ్ కారం జయ, పర్ణశాల ఎంపీటీసీ సభ్యుడు తెల్లం భీమరాజు, గ్రామ పంచాయతీ కార్యదర్శి శైలజ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.