Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. వివిధ కారణాలు, అనారోగ్య సమస్యలతో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి మనోదైర్యం చెప్పారు. పోడు సాగుదారులను ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పెద్దతోగు గ్రామానికి చెందిన పోడు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా వెంటనే స్పందించిన రేగా జిల్లా ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేసి పోడు సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాల్లో అంతర్గత రోడ్లు మంజూరు చేయాలని పలు గ్రామాల ప్రజలు అడగడంతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట టీఆర్ఎస్ పినపాక నియోజకవర్గ నాయకులు భవాని శంకర్, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు తెల్లం భాస్కర్, నాయకులు మోకాళ్ళ వీరస్వామి, అబ్దుల్ నబీ, యవజన విభాగం మండల అధ్యక్షులు అజ్జు, సుధాకర్ తదితరులు ఉన్నారు.