Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించాలని ఎంపీడీవో ఎం.చంద్రమౌళి సూచించారు. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ నేపథ్యంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆదేశాల మేరకు శుక్రవారం మండల వ్యాప్తంగా ఫీవర్ సర్వే ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. తూరుబాక గ్రామంలో జరుగుతున్న ఇంటింటి ఫీవర్ సర్వేను ఆయన పరిశీలించారు. కోవిడ్-19 లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కిట్లు అందజేయాలని వైద్య సిబ్బందికి ఆయన సూచించారు. ఎంపీడీవో వెంట ఎంపీఓ ముత్యాలరావు, తూరుబాక సర్పంచ్ భూక్య చందు నాయక్, ఉప సర్పంచ్ బొల్లి సత్యనారాయణ, గ్రామ పంచాయతీ కార్యదర్శి రవికుమార్, వైద్య సిబ్బంది అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
ములకలపల్లి : మండల వ్యాప్తంగా ముమ్మరంగా ఫీవర్ సర్వే నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. పూనుగూడెంలో జరిగిన కార్యక్రమంలో మండల వైద్యాధికారి ఉదయలక్ష్మి పాల్గొని, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైద్యసిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పినపాక పినపాక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇంటి ఇంటికీ ఆరోగ్యంలో భాగంగాతో గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో తహసీల్దార్ విక్రమ్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికీ తిరుగు తూ ఫీవర్ సర్వే వివరాలను ఆరోగ్య సిబ్బంది తెలుసు కున్నారు. ఐదు రోజుల తరువాత కూడ జ్వరం తగ్గని కేసులను హాస్పిటల్కు పంపి చికిత్స అందించాలని డాక్ట ర్ శివ కుమార్ ఆదేశించారు. వైద్య, పంచాయతీ, రెవెన్యూ, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.