Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ యువతకు పీవైఎల్ పిలుపు
నవతెలంగాణ-ఇల్లందు
భూస్వామి నెమరగొమ్మల రాఘవేంద్రరావు జ్ఞాపకార్థం జనవరి 23 నుండి మై ఫోర్స్ ఆధ్వర్యంలో లచ్చగూడెంలో నిర్వహించే క్రీడలను వ్యతిరేకించాలని ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతా నర్సింహారావు, పర్షిక రవి యువతకు పిలుపు నిచ్చారు. శుక్రవారం ఇల్లందులో జరిగిన పీవైఎల్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. నెమరగొమ్మల రాఘవేంద్రరావు అనే భూస్వామి ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని సుమారు నాలుగు వేల ఎకరాల భూమిని పట్టా చేయించుకున్నాడన్నారు. ఆ తర్వాత గిరిజనులు, పేదలు భూములను భూస్వామికి వ్యతిరేకంగా పోరాడి స్వాధీనపరచుకుని నేడు సాగు చేసుకుంటూ జీవిస్తున్నారని అన్నారు. అలాంటి ప్యూడల్ ఆలోచన కలిగిన నెమరగొమ్ముల రాఘవేంద్రరావు జ్ఞాపకార్థం క్రీడలు నిర్వహించడం అంటే మళ్ళీ భూస్వామ్య విధానాన్ని బలపరచడమేనని ప్రజలను ఆ వైపుగానే నెట్టివేయడమేనని, గిరిజనుల పేదల భూములను మళ్లీ దొరలకు అప్పగించే కుట్రలో భాగంగానే ఈ క్రీడలు నిర్వహిస్తున్నారని అన్నారు. కావున యువకులు క్రీడాకారులు, క్రీడాభిమానులు అర్థం చేసుకొని ఈక్రీడలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ క్రీడలను వ్యతిరేకిస్తూ స్థానిక ఆదివాసీ సంఘం గ్రామ పెద్దలు చేసిన ప్రకటనను పీవైఎల్ సంపూర్ణాంగా బలపరుస్తుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు వజ్జా మధు జోగ కృష్ణ, భూక్యా మంగ్య, ఎనగంటి లాజర్, సమ్మయ్య పాల్గొన్నారు.