Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రిటైర్డ్ కార్మికులు వినూత్న నిరసన
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి రిటైర్మెంట్ అయిన కార్మికులకు గ్రాడ్యూటీ 1జనవరి 2017 నుండి రూ.20 లక్షలు ఇచ్చే విషయంలో సింగరేణి యాజమాన్యం కార్మికులకు అన్యాయం చేసిందని, ఆఫీసర్లకు ఒక తీరుగా, కార్మికులకు మరో తీరుగా వ్యవహరిస్తోందని రిటైర్మెంట్ కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. శుక్రవారం రిటైర్డ్ కార్మికులు ఆఫీసర్లకు కార్మికులకు ఒకే విధంగా గ్రాడ్యూటీ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని ఫ్లెక్సీ మీద సింగరేణి కార్మిక సంఘాల నాయకులు బొమ్మలు ముద్రించే వినూత్న రీతిలో దండాలు పెడుతూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ కార్మికులు, గాంధీపధం కన్వీనర్ చింతల చెరువు గెర్షోం, పఠాన్ నవాబు ఖాన్, బి.సుందర్ రావు, పి.సంజీవరావు, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, వీరస్వామి, డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.