Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల ప్రమాద భీమా వర్తిస్తుందని ఆ పార్టీ పినపాక నియోజకవర్గ కో-ఆర్డినేటర్ చీమల వెంకటేశ్వర్లు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మామకన్ను సర్పంచ్ కొడెం ముత్యమాచారి అన్నారు. శుక్రవారం మండలంలోని లక్ష్మిపురం గ్రామంలో ఎన్రోలర్ వాంకుడోత్ రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు కుంజ క్రిష్ణ, పడుగోనిగూడెం సర్పంచ్ కొటెం జయసుధ శోభన్ బాబు, యూత్ అధ్యక్షులు దుర్గా, నాగరాజు, సీతరాములు, వెంకటేశ్వర్లు, సాంబ య్య, లింగమ్మ, ఆదిలక్ష్మి, పొట్టెమ్మ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.