Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సహకార సంఘం చైర్మెన్ రవి శేఖర్ వర్మ
నవతెలంగాణ-పినపాక
మండలంలోని టి.కొత్తగూడెం గ్రామానికి చెందిన శెట్టిపల్లి బుజ్జమ్మ కుటుంబానికి సహకార సంఘం చైర్మెన్ రవి శేఖర్ వర్మ, ఎంపీపీ గుమ్మడి గాంధీ చేతుల మీదుగా రూ.లక్ష చెక్కును సహకార సంఘ కార్యాలయంలో ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ రవి శేఖర్ వర్మ మాట్లాడుతూ టీ.కొత్తగూడెం గ్రామానికి చెందిన బుజ్జెమ్మ సహకార సంఘంలో సభ్యురాలుగా ఉండి ఇక్కడే లోను కూడా తీసుకొని ప్రమాదవశాత్తు మరణించడం జరిగిందని, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.లక్ష, సాధారణంగా మరణిస్తే రూ.50 వేల బీమా సౌకర్యం ఉండటంతో నామినిగా ఉన్న ఆమె భర్త చంద్రరావుకు రూ.లక్ష చెక్కును అందజేసినట్టుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బత్తుల వెంకట్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, సహకార సంఘ డైరెక్టర్లు కొండేరు రాము, సమ్మయ్య, సతీష్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి, సీనియర్ నాయకులు వాసుబాబు, బొలిశెట్టి నరసింహారావు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.