Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జెడ్పీ చైర్మన్ కమల్ రాజు
నవతెలంగాణ-బోనకల్
ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎంతోమంది నిరుపేదలకు ఆర్థికంగా లబ్ది చేకూరుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. బోనకల్ మండల పరిధిలో నారాయణపురం, రావినూతల, పెద్ద బీరవల్లి, బోనకల్ గ్రామాలకు చెందిన ఏడుగురికి రూ.2,08,500 విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఆదివారం అందచేశారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మృతుల కుటుంబాలను పరామర్శించి వారికి సంతాపం తెలిపారు. బంధం వెంకటేశ్వర్లు నూతన గృహప్రవేశం ఇటీవల జరగగా వారి ఇంటికి వెళ్లి వారికి శుభాకాంక్షలు తెలిపారు. జొన్నలగడ్డ కొండరాజు ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, మండల ప్రధాన కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాదరావు, మాజీ జెడ్పీటీసీ బానోతు కొండా, టీఆర్ఎస్ నాయకులు కరివేద సుధాకర్, ఉద్దండు, ధన మూర్తి, ఆయా గ్రామాల నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.