Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐద్వా డిమాండ్
నవతెలంగాణ-కొత్తగూడెం
ఆదివాసీ మహిళలపై ఆమా నుషంగా దాడికి పాల్పడిన అటవీ శాఖ ఉద్యోగులను కఠినంగా శిక్షించా లని ఐద్వా పట్టణ కార్యదర్శి సందకూ రి లక్ష్మీ ప్రభుతాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మధుర బస్తీ, రామాటాకీస్ ఏరియాలో ప్లకార్డులు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 2 రోజుల క్రితం ములకలపల్లిలో జరిగిన గిరిజన మహిళలపై దాడి చేయడాన్ని ఐద్వా తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. గిరిజన మహిళలు కట్టెలక కోసం అడవికి వెళ్లగా వారిని ఫారెస్ట్ అధికారి మహిళలను చూడకుండా వారిని దుర్భాషలాడి మహిళలపై ఆమానుషంగా ప్రవర్తించడాన్ని ఖండించారు. వారిని వెంటనే అరెస్టుచేసి, కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరా, నందిపాటి రజిత, రమా, రమాదేవి, ముంతాజ్, బిజీయా తదితరులు పాల్గొన్నారు.