Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల దగ్గరకు వెళ్లి గుడ్లు సఫ్లై చేయకుండా కొన్ని సెంటర్ల అంగన్వాడీ టీచర్లను మండల కేంద్రానికి వస్తేనే గుడ్లు సరఫరా చేస్తానని భీష్మించుకుని కూచున్న గుడ్ల సఫ్లయర్పై చర్యలు తీసుకుంటామని సీడీపీవో తార అన్నారు. ఈ విషయమై ఆదివారం మండలంలోని చిన్న వెంకటాపురం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ తార మాట్లాడుతూ... అంగన్వాడీ కేంద్రంలోని గుడ్లను బరువు తీయడంతో పాటు చిన్న వెంకటాపురం, దామరతోగు గ్రామాల పటేల్, మినీ అంగన్వాడీ కార్యకర్తలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్న వెంకటాపురం, దామరతోగు అంగన్వాడీ కేంద్రాల్లో సిగల్ లేని కారణంగా అంగన్వాడీ టీచర్లను మండల కేంద్రానికి వచ్చి గుడ్లు తీసుకోవాలని అనడం కరెక్ట్ కాదని, దీంతో టీచర్లు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అందుకు కారణమైన గుడ్ల సఫ్లయర్పై తగు చర్యలు తీసుకుంటామన్నారు.