Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నేరమయ రాజకీయాలు అంతం కావాలి
అ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ ప్రజా పోరాటాలు నిర్మించడం ద్వారా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ సీపీఐనేనని, నియోజక వర్గంలో నేరమయ రాజకీయాలకు చరమగీతం పాడాలని, ప్రజలకోసం పనిచేస్తే ఏ పార్టీకైనా ప్రజాదారణ ఉంటుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశవరావు పేర్కొన్నారు. చుంచుపల్లి మండలం, రాంనగర్లో ఆదివారం నూతన సభ్యులతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసి, మాట్లాడారు. సీపీఐ నిర్వహిస్తున్న పోరాటాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. నియోజక వర్గంలో నేరమయ రాజకీయాలు అంతం కావాలంటే ప్రజలు చైతన్యవంతం కావాలని, ప్రజల కోసం పనిచేసే పార్టీలను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా, సిహెచ్.మాదవ రావు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గరాశి వెంకన్న, వై.శ్రీనివాసరెడ్డి, మండల కార్యదర్శి సలిగిటి శ్రీనివాస్, ఎస్ఎంపీపీ వట్టికొండ మల్లిఖార్జున రావు, జిల్లా సమితి సభ్యులు వాసిరెడ్డి మురళి, దమ్మాలపాటి శేషయ్య, జి.వీరస్వామి, సర్పంచ్ బానోతు గోవిందు, ఎంపీటీసీ రాంబాబు, ఉపసర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.