Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
మాయమాటలు చెప్పి భార్యకు ముఖం చాటేసిన భర్త నుంచి న్యాయం కావాలని ఓ మహిళ తన కుమారుడితో కలిసి ఈనెల 18న దీక్ష చేస్తున్న సారపాకకు చెందిన శెట్టిమల్ల సులోచనకు దిశ కమిటీ సభ్యులు మద్దతు తెలిపారు. చర్చి ఫాస్టర్గా పనిచేస్తున్న సువర్ణరాజు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుని ఓ బాబు పుట్టాక ముఖం చాటేయడంతో సులోచన గత ఆరు రోజులుగా న్యాయం కోసం పోరాడుతూ దీక్షను కొనసాగిస్తుంది. సులోచన దీక్ష విషయం తెలుసుకున్న జిల్లా దిశ కమిటీ సభ్యులు ఆమె వద్దకు వచ్చి మద్దతు తెలిపి న్యాయం జరిగేంతవరకు సులోచనకు అండగా ఉంటామని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేసేలా కృషి చేస్తామన్నారు. ఆమెకు ఎలాంటి అన్యాయం జరిగినా సహించేదిలేదన్నారు. మహిళకు మద్ధతు పలికిన వారిలో దిశ కమిటీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కందుల సుజాత, అశ్వాపురం మండల అధ్యక్షురాలు మద్దెల అన్నపూర్ణ, సభ్యులు మాలోతు సువర్ణ, మల్లు స్వరూప, శెట్టి హేమలత ఉన్నారు.