Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఏకగ్రీవంగా ఎన్నిక....పలువురు అభినందనలు
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం గంగపుత్ర సంఘం జిల్లా సంఘం ఎన్నిక ఆదివారం జరిగింది. స్థానిక గాజుల రాజం బస్తీలో జరిగిన కార్యక్రమంలో జిల్లా గంగ పుత్రుల సంఘం ఎన్నిక జరిగింది. జిల్లా అధ్యక్షులుగా కొదురుపాక రాజేంద్ర ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా గడ్డం రాజయ్య, అధ్యక్షులుగా కొదురుపాక రాజేంద్ర ప్రసాద్, ఉపాద్యక్షులుగా బైరి శ్రీనివాసన్, ప్రధాన కార్యదర్శిగా రచ్చ నర్సయ్య, సహాయకార్యదర్శిగా పిల్లి కుమారస్వామి, కోశాధికారిగా పెద్దపెల్లి శంకర్, ఆర్గనైజర్ కార్యదర్శులుగా రంగా వెంకన్న, ఎరువ శివకుమార్, ప్రచార కార్యదర్శిగా కొదురుపాక రామ్ చందర్, ముఖ్య సలహాదారులుగా ఇండ్ల రామస్వామి, మద్దెర్ల ధర్మయ్య, సలహాదారులుగా రచ్చ శ్రీరాములుతో పాటు 27 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన సంఘం సభ్యులను పలువురు అభినందించారు.